లాక్డౌన్ కాలాన్ని జీహెచ్ఎంసీ యంత్రాంగం సద్వినియోగం చేసుకుంటోంది. రద్దీ లేకపోవడం వల్ల రాత్రింబవళ్లు రోడ్డు విస్తరణ పనులు, వంతెన నిర్మాణాలు చేపడుతోంది. ఎల్బీనగర్, బైరామల్‌గూడ, కామినేని, శేరిలింగంపల్లిలో ఇప్పటికే పనులు వేగవంతం చేస్తున్నట్టు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. నగరంలో జరుగుతున్న పనులను మేయర్ పర్యవేక్షించారు.
లాక్డౌన్ పూర్తయ్యే నాటికి నగరంలో మార్పులు: మేయర్ - అభివృద్ధి పనులు పరిశీలించిన మేయర్
లాక్డౌన్ పూర్తయ్యే నాటికి నగరంలో ఎన్నో మార్పులు వస్తాయని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. రద్దీ లేకపోవడం వల్ల నగరంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
లాక్డౌన్ పూర్తయ్యే నాటికి నగరంలో మార్పులు: మేయర్
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రహదారులు, 500 అండర్‌పాస్‌లు, నాలా విస్తరణ పనులపై నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నట్టు మేయర్ తెలిపారు. ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా ఎల్బీ నగర్లో పైవంతెన నిర్మాణానికి అడ్డుగా ఉన్న మైసమ్మ దేవాలయాన్ని తొలిగించారు. యుద్ధ ప్రాతిపదికన అవకాశం ఉన్న అన్ని పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. లాక్డౌన్ పూర్తయ్యే నాటికి నగరంలో ఎంతో మార్పు వస్తుందని మేయర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:చికెన్ బిర్యానీ పెట్టలేదని కరోనా రోగికి కోపమొచ్చింది!