సమ సమాజ స్థాపన కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద ఆయన విగ్రహానికి మేయర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
'నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి' - mayor vijayalaxmi tributes to ambedkar
హైదరాబాద్‌లో డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు.
అంబేడ్కర్‌కు జీహెచ్ఎంసీ మేయర్ నివాళులు
అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మేయర్ అన్నారు. ఆయన సూచించిన మార్గంలో పయనించి నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:అంబేడ్కర్‌కు నివాళులర్పించిన గద్దర్