హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు హోటళ్లు, రెస్టారెంట్ల ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు మరింత చిత్తశుద్ధితో పనియాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి సూచించారు. మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు తమ తమ సలహాలు, సూచనలు అందించాలని అధికారులను కోరారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆరోగ్య పారిశుద్ధ్య విభాగం చేపట్టే కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
'మరింత చిత్తశుద్ధితో పనియాలి.. అధికారులకు మేయర్ ఆదేశం' - GHMC Mayor Vijayalakshmi review meeting
జీహెచ్ఎంసీ అధికారులతో మేయర్ విజయలక్ష్మి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మరింత చిత్తశుద్ధితో పనియాలని అధికారులకు మేయర్ సూచించారు.
'మరింత చిత్తశుద్ధితో పనియాలి.. అధికారులకు మేయర్ ఆదేశం'
శానిటైషన్, ఆరోగ్య, జనన, మరణాలు వెటర్నరీ ఎంటామాలజీ వ్యర్థ పదార్థాల నిర్వహణ తదితర అంశాల్లో అమలవుతున్న పనులను విజయలక్ష్మి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే హెల్త్, శానిటైషన్ విభాగంలో తగు మార్పులు కూడా చేయాలని మేయర్ సూచించారు.