తెలంగాణ

telangana

ETV Bharat / state

GHMC మేయర్‌కు చేదు అనుభవం.. MLA లేకుండా ఎందుకొచ్చారంటూ.. - bitter experience to GHMC Mayor in uppal

GHMC Mayor : జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. ఉప్పల్ చిలుకానగర్‌లో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన మేయర్‌ను సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేను పిలవకుండా ఆయన నియోజకవర్గంలో ఎలా శంకుస్థాపనలు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు.

GHMC Mayor
GHMC Mayor

By

Published : Dec 20, 2022, 1:04 PM IST

Updated : Dec 20, 2022, 1:28 PM IST

GHMC మేయర్‌కు చేదు అనుభవం

GHMC Mayor : హైదరాబాద్‌ ఉప్పల్‌లో జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ నేతలే ఆమెను అడ్డుకునేందుకు యత్నించటం ఉద్రిక్తతలకు దారితీసింది. ఉప్పల్‌ పరిధిలోని చిలుకానగర్‌లో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు మేయర్‌ వెళ్లారు. స్థానిక ఎమ్మెల్యేను పిలవకుండా నియోజకవర్గంలో శంకుస్థాపనలు ఎలా చేస్తారంటూ ఉప్పల్‌ ప్రాంతానికి చెందిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు మేయర్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. ఎమ్మెల్యే వర్గీయులు, మేయర్‌ వర్గీయులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.

మేయర్‌ ప్రొటోకాల్‌ పాటించటం లేదంటూ ఎమ్మెల్యే వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న వారిపై మేయర్‌ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యేను జోనల్‌ కమిషనర్‌ ఆహ్వానించారని.. తననూ జోనల్‌ కమిషనరే పిలిచారని మేయర్‌ విజయలక్ష్మి తెలిపారు. ఎమ్మెల్యేను తాను స్వయంగా ఆహ్వానించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ మేరకు కార్యకర్తలకు సర్దిచెప్పి మేయర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Last Updated : Dec 20, 2022, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details