జీహెచ్ఎంసీ మేయర్‌గా ఎన్నికైన విజయలక్ష్మి సంతోషం వ్యక్తంచేశారు. ఈ పదవి కోసం తన పేరును ఎంపిక చేసిన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఒకేసారి ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్న విజయలక్షి... అన్ని పార్టీల సభ్యులను కలుపుకునిపోతానని తెలిపారు. నగరం అభివృద్ధి కోసం అందరి సలహాలు స్వీకరిస్తామని వెల్లడించారు. మహిళలకు మరింత భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు.
'అన్ని పార్టీలతో కలసి నగరాన్ని అభివృద్ధి చేస్తాం' - తెలంగాణ వార్తలు
హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికవడంపై విజయలక్ష్మి, శ్రీలత హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని పార్టీలతో కలిసి నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. పీఠాలను తెరాస కైవసం చేసుకుంది. మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోత శ్రీలత ఎన్నికయ్యారు. శ్వేతామహంతి ఆధ్వర్యంలో... ఎంఐఎం మద్దతుతో తెరాస రెండు పీఠాలు దక్కించుకుంది.
అన్ని పార్టీలతో కలసి నగరాన్ని అభివృద్ధి చేస్తా: మేయర్ విజయలక్ష్మి
జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికవడం పట్ల తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల నుంచి తెరాసలో ఉన్నామని... పార్టీ మమ్మల్ని గుర్తించి డిప్యూటీ మేయర్‌గా అవకాశం ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని శ్రీలత వెల్లడించారు.
ఇదీ చూడండి:తొలిసారిగా ఇద్దరు మహిళలకు గ్రేటర్ పీఠం