తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉస్మానియా ఆసుపత్రిలో మేయర్ తనిఖీలు - జీహెచ్ఎంసీ మేయర్

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించి.. అక్కడ అందుతోన్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు పారిశుద్ధ్యంలో తమ వంతు బాధ్యత వహిస్తూ.. చెత్తను ఓపెన్ పాయింట్​లలో వేయవద్దని విజ్ఞప్తి చేశారు.

GHMC Mayor
ఉస్మానియా ఆసుపత్రి

By

Published : May 25, 2021, 3:30 PM IST

జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్ రూమ్​ను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. ఆసుపత్రుల్లో పడకల కోసం సంప్రదించిన బాధితులకు.. బెడ్ ఇప్పించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు.

ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన మేయర్​.. హాస్పిటల్​లో అందుతోన్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ రోగులను.. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. హాస్పిటల్​లో పారిశుద్ధ్య లోపాలను గమనించి.. చెత్తను తక్షణమే తరలించాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. జియాగూడ, లంగర్ హౌజ్​, గోల్కొండ, తదితర ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపుల పేరుకుపోయి ఉన్న చెత్తను చూసి.. ప్రజలు పారిశుద్ధ్యంలో తమ వంతు బాధ్యత వహిస్తూ చెత్తను ఓపెన్ పాయింట్​లలో వేయవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:కరోనాతో రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ మృతి

ABOUT THE AUTHOR

...view details