తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్​ఎంసీ తొలి కౌన్సిల్​ సమావేశం ఆన్​లైన్​లో.. : మేయర్​

కరోనా వ్యాప్తి నేపథ్యంలో జీహెచ్​ఎంసీ తొలి కౌన్సిల్​ సమావేశాన్ని ఆన్​లైన్​లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు మేయర్​ విజయలక్ష్మి చెప్పారు. కొవిడ్​ కేసుల వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ghmc mayor
జీహెచ్​ఎంసీ మేయర్​

By

Published : Apr 12, 2021, 6:53 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ తొలి కౌన్సిల్ సమావేశాన్ని ఆన్​లైన్​లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ నెలాఖరు వరకు ఎప్పుడైనా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. కరోనా రెండో దఫా కేసులు పెరుగుతుండటంతో ఆన్​లైన్ సమావేశాలపై ఆలోచన చేస్తున్నామని మేయర్​ తెలిపారు.

ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్​లో 150 మంది కార్పొరేటర్లు భౌతిక దూరం పాటించేంత సీటింగ్ సౌకర్యం లేదని మేయర్​ అన్నారు. కరోనా కేసుల నేపథ్యంలో చెత్త తరలింపుపై ప్రధానంగా దృష్టిసారించినట్లు చెప్పారు. డస్ట్​బిన్ ఫ్రీ సిటీగా హైదరాబాద్​ను ఉంచాలనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రేటర్​లోని అన్ని డివిజన్లలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:సీఎం కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details