తెలంగాణ

telangana

ETV Bharat / state

బయో డైవర్సిటీ పైవంతెనలో లోపాలు లేవు: లోకేష్​ కుమార్​ - bio diversity fly over in Hyderabad

ప్రమాదాలకు నిలయమైన గచ్చిబౌలి బయో డైవర్సిటీ పైవంతెనలో ఎటుంవంటి లోపాలు లేవని నిపుణుల కమిటీ తమ నివేదికలో పేర్కొందని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ వెల్లడించారు. వంతెనపై వాహనాల వేగం 40 కిలోమీటర్ల కంటే మించకుండా చర్యలు చేపట్టాలని కమిటీ సూచించినట్లు చెప్పారు.

ghmc mayor lokesh kumar on bio diversity fly over in Hyderabad
బయో డైవర్సిటీ పైవంతెనలో లోపాలు లేవు: లోకేష్​ కుమార్​

By

Published : Dec 18, 2019, 4:45 PM IST

గచ్చిబౌలి బయో డైవర్సిటీ పైవంతెనపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ... నివేదికను జీహెచ్​ఎంసీకి అందజేసింది. పైవంతెనలో ఎటుంవంటి లోపాలు లేవని నిపుణు కమిటీ నివేదికలో పేర్కొందని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ వెల్లడించారు. గంటకు 40కిలోమీటర్ల వేగంతో వెళ్లడానికి బయోడైవర్సిటీ పైవంతెనలో ఎటుంవంటి లోపాలు లేవని తేల్చిందన్నారు.

భారీగా ఛలాన్లు

950 మీటర్లు ఉన్న ఈ వంతెనపై వేగం 40 కిలోమీటర్ల కంటే మించకుండా చర్యలు చేపట్టాలని.. నిభంధనలు అతిక్రమిస్తే భారీగా ఛలాన్లు విధించాలని సూచించినట్లు తెలిపారు. వేగ నిబంధనలపై సైన్ బోర్డులు, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపిందన్నారు. రాత్రి వేళల్లో పక్క గోడ స్పష్టంగా కనిపిచే విధంగా ఏర్పాటు చేయాలని కమిటీ సూచించిందని కమిషనర్ తెలిపారు. నివేదికను పరిశీలించిన అధికారులు ప్రభుత్వానికి పంపారు.

బయో డైవర్సిటీ పైవంతెనలో లోపాలు లేవు: లోకేష్​ కుమార్​

ఇదీ చూడండి: గోదాం నిర్మాణాలకు కేంద్రం సహకరించాలి: నిరంజన్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details