జీహెచ్ఎంసీ కార్యాలయంలో విద్యుత్ అంతరాయంపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి..కమిషనర్ లోకేష్ కుమార్‌కు లేఖ రాశారు. బంజరాహిల్స్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో తరచుగా విద్యుత్ అంతరాయం అవుతోందని మేయర్ లేఖలో పేర్కొన్నారు.
విద్యుత్ అంతరాయం వల్ల రోజువారి ఆఫీస్ కార్యకలాపాలకు ఇబ్బంది అవుతోందని మేయర్ వెల్లడించారు. తన క్యాంప్ కార్యాలయంలో వెంటనే 25కేవీ జనరేటర్ ఏర్పాటు చేయాలని మేయర్ కమిషనర్‌ను కోరారు.
విద్యుత్ కోతలు ఉన్నాయని చెప్పలేదు: మేయర్
జీహెచ్ఎంసీ కమిషనర్‌కు లేఖపై మేయర్ గద్వాల విజయలక్ష్మి వివరణ ఇచ్చారు. తన ఇంటి వద్ద విద్యుత్ లైన్ల పనులు జరుగుతున్నాయని... తవ్వకాల వల్ల విద్యుత్‌కు అంతరాయం కలుగుతోందని మేయర్ వివరించారు. అందుకే తాత్కాలికంగా జనరేటర్ ఏర్పాటు చేయాలని కోరానని ఆమె స్పష్టత ఇచ్చారు. నగరంలో విద్యుత్ కోతలు ఉన్నాయని తాను చెప్పలేదని మేయర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'బాబ్లీ కోసం పోరాడినట్లే కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాడతాం'