గ్రేటర్ హైదరాబాద్లో రోడ్లపై ఎక్కడ చెత్త వేయొద్దని నగరవాసులను మేయర్ గద్వాల విజయలక్ష్మి కోరారు. నగరంలో జరుగుతున్న ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ సందర్భంగా ఖైరతాబాద్, కూకట్పల్లి జోన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మేయర్ తనిఖీ చేశారు. ఖైరతాబాద్ జోన్కు సంబంధించి ట్విట్టర్లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీకే గూడ దాసరం బస్తీని సందర్శించి బస్తీలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. కూకట్పల్లి జోన్లోని ఫతేనగర్ పిట్టలబస్తీ, బాలనగర్ గ్యాస్ కంపెనీ రోడ్డు, చింతల్, మహాదేవపురం, సమ్శి గూడ సిక్కుల బస్తీ, పర్కి చెరువు, ఎన్టీఆర్ నగర్ ఎల్లమ్మబండ, నార్నే నగర్, నవోదయ కాలనీ, ఎల్లమ్మబండ చెరువు ప్రాంతాలను మేయర్ సందర్శించారు.
గ్రేటర్ పరిధిలో రోడ్లపై చెత్త వేయొద్దు: మేయర్ - ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్
గ్రేటర్ పరిధిలో రోడ్లపై చెత్త వేయొద్దని నగరవాసులకు మేయర్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. నగరంలోని ఖైరతాబాద్, కూకట్పల్లి జోన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మేయర్ తనిఖీ చేశారు. బస్తీల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని ఆదేశించారు.
పిట్టలబస్తీలో చెత్త ఆటోలు రావడం లేదని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న రెండు కమ్యూనిటీ హాళ్లు నిరుపయోగంగా ఉండడం చూసి వెంటనే వాటిని మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. సమ్శి గూడ సిక్కుల బస్తీ వద్ద ఉన్న పర్కి చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తీయాలని.. ఆ కాలనీలో చెత్త ఆటో పెట్టి మొత్తం బ్లీచింగ్ చేయాలన్నారు. ఎన్టీఆర్ నగర్ ఎల్లమ్మబండ వద్ద పేరుకుపోయిన చెత్తను చూసి.. వెంటనే తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: పారిశుద్ధ్య కార్మికులను జాగ్రత్తగా చూసుకుంటున్నాం : కేటీఆర్