తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా: మేయర్​ - ghmc news

అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ సేవలందిస్తానని నగర మేయర్​ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా: మేయర్​
ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా: మేయర్​

By

Published : Feb 17, 2021, 4:33 PM IST

ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పష్టం చేశారు. అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ సేవలందిస్తానని ఆమె తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని గ్రీన్​హిల్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ ప్రతినిధులు మేయర్‌ విజయలక్ష్మిని కలిసి స్థానికంగా నెలకొన్న సమస్యలను విన్నవించారు.

అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కారించాలని కోరారు. గ్రీన్‌హిల్స్ జీహెచ్‌ఎంసీ పార్కును అభివృద్ది చేసి సుందరంగా తీర్చిదిద్దాలని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే నిధులు కేటాయించి పార్కుతోపాటు కాలనీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని మేయర్​ హామీ ఇచ్చారు.

ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా: మేయర్​

ఇదీ చదవండి: టూరిజం కోర్సులు, కొలువులకు ఫుల్ డిమాండ్

ABOUT THE AUTHOR

...view details