ట్యాంక్‌బండ్‌పై గణేశ్ నిమజ్జనం(Tank bund Ganesh Immrsion) ప్రశాంతంగా కొనసాగుతోంది. నిమజ్జనం వేగవంతంగా జరిగేలా ఎక్కువ క్రెయిన్ల ఏర్పాటు చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. నిమజ్జనం అంతా పూర్తయ్యాక పారిశుద్ధ్యం కోసం అన్ని చర్యలు చేపట్టాం. తాగునీరు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నాం. ట్యాంక్‌బండ్‌పై 20కి పైగా క్రేన్లు అందుబాటులోకి తెచ్చాం. కంట్రోల్ రూంల ద్వారా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నాం. ప్రతి ఒక్కరికీ ఉచితంగా మాస్కులు, శానిటైజర్లు అందిస్తున్నాం. పోలీసు శాఖతో కలిసి సమన్వయంగా పనిచేస్తున్నాం. నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా ప్రత్యేకంగా రవాణా సదుపాయం కల్పిస్తున్నాం. 7రోజుల నుంచి 162 బృందాలతో కలిసి పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నాం. పక్కా ప్రణాళికతో నిమజ్జనం సవ్యంగా సాగేలా చర్యలు తీసుకున్నాం.గద్వాల విజయలక్ష్మీ, జీహెచ్ఎంసీ మేయర్
GHMC Mayor on Immersion: 'నిమజ్జనం వేగంగా జరిగేలా ఎక్కువ క్రేన్లు ఏర్పాటు చేశాం' - ganesh immersion news
భాగ్యనగరంలో నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ(GHMC Mayor) స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లపై మేయర్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం