తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్​ఎంసీ మేయర్​​కు కరోనా పరీక్షలు - జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్

జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు చేసిన వైద్య పరీక్షల్లో కరోనా నెగిటివ్‌గా నిర్ధరణ అయింది. ఇటీవల స్పెషల్‌ శానిటైజేషన్‌ డ్రైవ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక హోటల్‌లో ఆయన టీ తాగారు. గతంలో ఆ టీ దుకాణంలో పని చేసే మాస్టర్‌కు కరోనా సోకటం వల్ల ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

GHMC Mayor Bonthu Ramohan Corona Negative in medical tests
నగర మేయర్​​కు కరోనా నెగిటివ్​

By

Published : Jun 7, 2020, 4:00 PM IST

జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు వైద్య పరీక్షల్లో కరోనా నెగిటివ్‌గా నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇటీవల ముషీరాబాద్​ డివిజన్​ పరిధిలో జరిగిన స్పెషల్​ శానిటైజేషన్​ డ్రైవ్​ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్​తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ఓ హోటల్​లో టీ తాగారు. గతంలో ఆ టీ దుకాణంలో పనిచేసే మాస్టర్‌కు కరోనా సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మేయర్ ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటివ్​గా నిర్ధరణ అయింది.

ABOUT THE AUTHOR

...view details