హైదరాబాద్ షేక్ పేట వద్ద ఎస్ఆర్‌డీపీ, సీఆర్‌ఎంపీ పనులను మేయర్ బొంతు రామ్మోహన్ పర్యవేక్షించారు. ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో భాగంగా షేక్ పేట వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులకు అడ్డంగా మారిన బాటిల్ నేక్స్‌ను త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు.
'షేక్‌పేటలో అభివృద్ధి పనులను పరిశీలించిన మేయర్' - 'షేక్ పేటలో అభివృద్ధి పనులను పరిశీలించిన మేయర్'
హైదరాబాద్ షేక్‌పేటలో పలు అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. అనంతరం షేక్‌పేట ప్లైఓవర్ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్లైఓవర్ పనులకు అడ్డంకులు లేకుండా చూడాలి : మేయర్
షేక్ పేట జంక్షన్ విస్తరణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మేయర్ సూచించారు. ప్లైఓవర్ పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేయాలన్నారు. పని వేళలు పెంచడానికి ప్రత్యామ్నాయ రహదారులను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి : గవర్నర్ ప్రసంగానికి నేడు ధన్యవాదాలు తెలిపే తీర్మాణం
TAGGED:
Mayor Visit Shaikpet