ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ తదితర పన్నులను పెంచకుండా అదనపు ఆదాయాన్ని పొందే మార్గాలను అన్వేషించాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో చేపడుతున్న పలు కార్యక్రమాలు, అభివృద్ది పథకాలు, స్వచ్ఛ కార్యక్రమాలపై శుక్రవారం జీహెచ్ఎంసీ అధికారులతో మేయర్ సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కావాల్సిన నిధులను సేకరించుకునేందుకు ఆదాయ మార్గాలను పటిష్ఠం చేసుకోవాలని సూచించారు. 105 రెసిడెన్షియల్ మార్గాలను కమర్షియల్ రోడ్లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీచేయనుందన్నారు. తద్వారా ఆదాయం పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
అక్రమ నిర్మాణాలు, దోమల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ బృందాలు సత్ఫలితాలు సాధిస్తున్నాయని, ఈ బృందాలను ప్రతి సర్కిల్‌కు ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి తగు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో చేపడుతున్న ఎస్ఆర్డీపీ, రోడ్లు, నాలాల విస్తరణకు సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులతో చర్చించారు.
ఆదాయ మార్గాల్ని అన్వేషించండి :మేయర్ - MEETING
జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ తదితర పన్నులను పెంచకుండా అదనపు ఆదాయాన్ని పొందే మార్గాలను అన్వేషించాలని మేయర్ బొంతు రామ్మోహన్ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఆదేశించారు. పలు అభివృద్ధి పనులపై మేయర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆదాయ మార్గాల్ని అన్వేషించండి :మేయర్
ఇదీ చూడండి :వాడివేడిగా నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం