అర్హులైన పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. ఈసారి ఎన్నికల్లో నూతన ఓటరు జాబితా తాజా ఓటర్ల నమోదు ఆధారంగానే ఉంటుందని... గతంలో ఓటరుగా నమోదైన వారు కూడా మరోసారి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని మేయర్ తెలిపారు.
'అర్హులైన పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి' - తెలగాణలో ఎమ్మెల్సీ ఓట్ల నమోదు
అర్హులైన పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. 2017 నవంబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లు అందరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.
'అర్హులైన పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి'
మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరుగా నమోదుకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎస్.పంకజకు ఫారం 18 దరఖాస్తు అందజేశారు. మేయర్ రామ్మోహన్‌తో పాటు ఆయన సతీమణి శ్రీదేవి దరఖాస్తును సమర్పించారు.
ఇదీ చూడండి:స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ చిరంజీవులు బదిలీ