బస్తీ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. గోశామహల్లో ఏర్పాటు చేసిన నూతన బస్తీ దవాఖానాను మంగలాట్ కార్పొరేటర్ పరమేశ్వరీ సింగ్తో కలిసి ప్రారంభించారు. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో 224 దవాఖానాలు నిర్మించినట్లు వెల్లడించారు.
'బడుగు బలహీన, పేద వర్గాల ఆసుపత్రి.. బస్తీ దవాఖానా'
గ్రేటర్ పరిధిలోని నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటివరకు 224 బస్తీ దవాఖానాలు ప్రారంభించామని నగర మేయర్ బొంతు రాంమోహన్ తెలిపారు. గోశామహల్ నియోజకవర్గంలో నూతన బస్తీ దవాఖానాను ప్రారంభించారు.
జీహెచ్ఎంసీ మేయర్ రాంమోహన్ గౌడ్
బడుగు, బలహీన వర్గాల, నిరుపేదల ఆసుపత్రి.. బస్తీ దవాఖానా అని మేయర్ పేర్కొన్నారు. మంగలాట్ డివిజన్లో చాలామంది పేదలున్నారని, వారందరికి బస్తీ దవాఖానా మెరుగైన వైద్యం అందిస్తుందని చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాను తీసుకొచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు నంద్ కిషోర్ బిలాల్, ప్రేమిసింగ్ రాఠోడ్, కార్పొరేటర్లు ముకేష్ సింగ్, మమత గుప్తా, ప్రభుత్వ వైద్య అధికారులు పాల్గొన్నారు.