హైదరాబాద్ రామంతపూర్ డివిజన్లో జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. మేడిపల్లి వినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిత్యవసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నిత్యవసర సరకులు పంపిణీ చేసిన మేయర్ - నిత్యవసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి
హైదరాబాద్ రామంతపూర్ డివిజన్లో సుమారు 400 మంది పేదలకు నిత్యవసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. పేదలను ఆదుకునేందుకు ముందుకువచ్చిన మేడిపల్లి వినయ్‌రెడ్డిని అభినందించారు.
![నిత్యవసర సరకులు పంపిణీ చేసిన మేయర్ ghmc mayor and mla subhash reddy inaugurated groceries distribution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6855330-400-6855330-1587297453402.jpg)
నిత్యవసర సరకులు పంపిణీ చేసిన మేయర్
సుమారు 400 మంది పేదలకు వివిధ రకాల సరకులను అందించారు. ఈ సందర్భంగా వినయ్‌రెడ్డిని మేయర్ అభినందించారు. పేదల ఆకలి తీర్చేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆకాంక్షించారు.
ఇవీచూడండి:పంజాగుట్టలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన కేటీఆర్