తెలంగాణ

telangana

ETV Bharat / state

'వర్షకాలంలో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి' - bonth ramhon

వర్షాకాలం రాబోతున్న సందర్భంగా నాళాల వెడల్పుపై దృష్టి పెట్టామని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. వచ్చే వానకాలంలో తీసుకునే చర్యలపై అధికారులతో సమీక్షించారు.

మేయర్​ సమీక్ష

By

Published : May 29, 2019, 9:33 PM IST

వర్షకాలంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​ ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాళాల వెడల్పుపై దృష్టి పెట్టామని... జూలై 15 వరకు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే వానకాలంలో ఇబ్బందులు ఎదుర్కొనే కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తయినట్లు తెలిపారు. ముంపు ప్రాంతాలు...సమస్యాత్మక ప్రాంతాలను తగ్గించుకుంటూ వస్తున్నామని మేయర్ చెప్పారు. ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు ఏడాదిన్నర కాలం లక్ష్యంగా చేసుకుని పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ వల్ల భూసేకరణలో కొంత ఆలస్యమైందన్నారు. ఆరు నెలలుగా ఎస్‌ఆర్‌డీపీ, నాళాల వెడల్పు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు.

ఇవీ చూడండి: కేటీఆర్​కు రేవంత్​ రెడ్డి బహింరంగ లేఖ

వర్షకాల సమస్యలపై జీహెచ్​​ఎంసీ మేయర్​ సమీక్ష

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details