హైదరాబాద్ చర్లపల్లిలో రెండో విడతలో గుర్తించిన వలస కార్మికులకు ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం, 500 రూపాయల పంపిణీ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. అన్ని శాఖల సమన్వయంతో హైదరాబాద్లో కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రేటర్లో ఉన్న 5 లక్షల మంది వలస కార్మికులను ఆదుకుంటున్నామని.. పారిశ్రామిక ఏరియాల్లో కార్మికులకు వసతి, భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్ - hyderabad latest news
అన్ని శాఖల సమన్వయంతో హైదరాబాద్లో కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. హైదరాబాద్ చర్లపల్లిలో రెండో విడతలో గుర్తించిన వలస కార్మికులకు ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం, 500 రూపాయల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్
వలస కార్మికులు ఆందోళన చెందొద్దని.. బియ్యం, నగదు అందని వారుంటే తమ దృష్టికి తీసుకొస్తే వారికి సాయం అందిస్తామని సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆర్థిక భారం ఎంతైనా ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
ఇవీచూడండి:11 నెలల పసికందును చంపి.. తల్లి ఆత్మహత్య