తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​ను మరింత అందంగా తీర్చిదిద్దడంపై సర్కారు దృష్టి - ఫ్లైఓవర్ల కింద పార్కుల ఏర్పాటు

parks under flyovers in Hyderabad : భాగ్యనగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఫ్లైఓవర్ల కింద పార్కుల అభివృద్ధిపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మొదటిసారిగా ప్రత్యేక పార్కు ఏర్పాటు చేశారు.

parks
parks

By

Published : Jan 1, 2022, 7:01 AM IST

parks under flyovers in Hyderabad : హైదరాబాద్‌ను మరింత అందంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఫ్లైఓవర్ల కింద పార్కుల అభివృద్ధిపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. జీహెచ్‌ఎంసీ అధ్వర్యంలో మొదటిసారిగా ఫ్లైఓవర్ కింద ప్రత్యేక పార్కు ఏర్పాటైంది. ఈ పార్కులో వాకింగ్ ట్రాక్, కూర్చోవడానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. పచ్చదనం పెంచడానికి 16 ఫ్లైఓవర్ పిల్లర్లపై అందమైన వర్టికల్ గార్డెన్‌తో అలంకరించారు. వాటిని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు.

ఫ్లైఓవర్ల కింద పార్కుల నిర్మాణం

ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లే వాహనదారులకు చక్కటి ప్రాణవాయువు అందించడానికి జీహెచ్​ఎంసీ బయోడైవర్సిటీ విభాగం ద్వారా పూల మొక్కలు నాటారు. కాలుష్య నియంత్రణ, సుందరీకరణ పెంపొందించడం కోసం వివిధ ఫ్లైఓవర్ల కింద వర్టికల్ గార్డెన్లు, ఆకర్షణీయమైన మొక్కలు నాటడం ద్వారా మరింత కొత్త అందాలు తీసుకొస్తున్నామని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు

ఇదీ చూడండి:new year wishes : రాష్ట్ర ప్రజలకు గవర్నర్,​ సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details