తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్​ఎంసీకి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు - స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు

స్వచ్ఛతలో భాగ్యనగరం ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డుతో మరోసారి సత్తా చాటింది.

మేయర్​ హర్షం

By

Published : Feb 11, 2019, 11:34 AM IST

జీహెచ్​ఎంసీకి స్వచ్ఛత అవార్డు
జీహెచ్ఎంసీని మరో అవార్డు వరించింది. కేంద్ర స్వచ్ఛ భారత్​ మిషన్​ హైదరాబాద్​కు స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు ప్రకటించింది. పది లక్షల జనాభా కలిగిన మెట్రోపాలిటన్​ సిటీల్లో కేవలం భాగ్యనగరానికి మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది. అవార్డుపై మేయర్​ బొంతు రామ్మోహన్​ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్​ను స్వచ్ఛనగరంగా తీర్చిదిద్దడానికి చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభించిందని తెలిపారు. పది రోజుల వ్యవధిలోనే రెండు గుర్తింపులు రావడంపై కమిషనర్​ దాన కిశోర్​ ఆనందాన్ని వెలిబుచ్చారు.

ABOUT THE AUTHOR

...view details