గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో సగం వరకు నగరంలోనివే కావడం వల్ల బల్దియా ప్రత్యేక దృష్టిసారిచింది. చార్మినార్ జోన్లో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల అక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రేటర్లో నిన్నటి వరకు 332 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పాజిటివ్ కేసులు ఉన్న పరిధిలో మొత్తం 106 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్ జోన్లో కరోనా పాజిటివ్ కేసులు 16, కంటైన్మెంట్ జోన్లు 14 ఉన్నాయి. నగరంలో అత్యధికంగా చార్మినార్ జోన్లో 219 కేసులు నమోదు కాగా.. 52 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.
గ్రేటర్లో విజృంభిస్తోన్న కరోనా... దృష్టిసారించిన బల్దియా - corona cases ion hyderabad
రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో... ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదవుతుడటం ఆందోళన రేకెత్తిస్తోంది. వైరస్ కట్టడికి జీహెచ్ఎంసీ పలు చర్యలు చేపడుతోంది.
ghmc foused on containment zones in Hyderabad
ప్రత్యేకంగా కంటైన్మెంట్ జోన్లలో రెండు సార్లు శానిటైజ్ చేసి... ఇంటింటికి తిరుగుతూ ఆరోగ్య స్థితిని గమనిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్ రూమ్‌కు రోజుకు వందల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. ఇవాళ 571 కాల్స్ వచ్చినట్లు జీహెచ్ఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది.వికలాంగులకు, వృద్ధుల కోసం అన్నపూర్ణ మొబైల్ క్యాంటీన్ ద్వారా 22 వేల 385 మందికి ఆహారం అందించినట్లు పేర్కొన్నారు.