తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో వీధికుక్కల నియంత్రణకు పైలెట్ ప్రాజెక్టు - Ghmc_Focus_On_Dogs vaccination and sterilization

వీధి కుక్కల నియంత్రణ పైలెట్​ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్​ నగరంలో ఐదు వార్డులను ఎంపిక చేసినట్లు జీహెచ్​ఎంసీ చీఫ్​ వెటర్నరీ అధికారి అబ్దుల్ వఖీల్​ తెలిపారు. ఈ ఐదు వార్డుల్లో దాదాపు 20 వేల వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ స్టెరిలైజేషన్​తో పాటు యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్​ చేస్తున్నట్లు ఆయన వివరించారు.

Ghmc_Focus_On_Dogs vaccination and sterilization
హైదరాబాద్​లో వీధికుక్కల నియంత్రణకు పైలెట్ ప్రాజెక్టు

By

Published : Jun 27, 2020, 8:37 PM IST

హైదరాబాద్​ నగరంలో వీధి కుక్కల నియంత్రణకు పైలెట్​ ప్రాజెక్టులో భాగంగా ఐదు వార్డులను ఎంపిక చేసినట్లు జీహెచ్​ఎంసీ చీఫ్​ వెటర్నరీ అధికారి అబ్దుల్ వఖీల్​ తెలిపారు. ఈ ఐదు వార్డుల్లో 100 శాతం వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ స్టెరిలైజేషన్​తో పాటు యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్​ చేస్తున్నట్లు ఆయన వివరించారు.

గ్రేటర్​ పరిధిలోని ఐదు వార్డుల వివరాలు

  • హయత్​నగర్​ సర్కిల్​లో నాగోల్- 11 వార్డు
  • చుడీ బజార్​ యానిమల్​ కేర్ సెంటర్ పరిధిలోని చార్మినార్​ సర్కిల్​లో ఉన్న శాలిబండ- 48 వార్డు
  • పటేల్​నగర్​ యానిమల్​ కేర్ సెంటర్ పరిధిలోని మెహిదీపట్నం సర్కిల్​లో ఉన్న ఆసిఫ్​నగర్- 72 వార్డు
  • కేపీహెచ్​బీ కాలనీ యానిమల్​ కేర్ సెంటర్ పరిధిలోని శేరిలింగంపల్లి సర్కిల్​లో శేరిలింగంపల్లి- 106 వార్డు
  • మ‌హ‌దేవ్‌పూర్ యానిమ‌ల్ కేర్ సెంట‌ర్ ప‌రిధిలో ఉన్న గాజుల‌రామారం స‌ర్కిల్‌లోని గాజుల‌రామారం -125 వార్డు

ఈ ఐదు వార్డుల‌లో దాదాపు 20వేల వీధి కుక్కలుండ‌గా... ఇప్పటి వ‌ర‌కు 1,179 వీధి కుక్కల‌కు కుటుంబ నియంత్రణ స్టెరిలైజేష‌న్‌, 2,016 వీధి కుక్కల‌కు యాంటి రాబిస్ వ్యాక్సినేష‌న్ చేసినట్లు వివ‌రించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details