జీహెచ్ఎంసీ నిబంధనలు పాటించని దుకాణాలకు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు జరిమానాలు విధించారు. నిబంధనలకు వ్యతిరేకంగా బోర్డులు, ప్రకటనలు ఏర్పాటు చేసిన దుకాణ యజమానులకు భారీ షాక్ ఇచ్చారు.
నిబంధనలు పాటించని దుకాణాలపై జీహెచ్ఎంసీ కొరడా - జీహెచ్ఎంసీ పరిధిలోని దుకాణాలపై కొరడా
నిబంధనలకు విరుద్ధంగా బోర్డులు ఏర్పాటు చేసిన దుకాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. నగరంలోని పలు చోట్ల దుకాణ యజమానులకు భారీ జరిమానాలు విధించారు.
![నిబంధనలు పాటించని దుకాణాలపై జీహెచ్ఎంసీ కొరడా GHMC Fines on shops who do not follow the regulations in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10653492-27-10653492-1613486823294.jpg)
నిబంధనలు పాటించని దుకాణాలపై జీహెచ్ఎంసీ కొరడా
నగరంలోని శాలిబండ పిస్తా హౌస్‌కు రూ.50 వేలు, ఎల్బీనగర్ లక్కీ రెస్టారెంట్‌కు రూ.1.5 లక్షలు, నాగోల్‌లోని శ్రీనివాస ఫర్నిచర్ రూ.లక్ష రూపాయల జరిమానా విధించినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది.