కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్లో ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ఇవాళ 704 బృందాలతో 51,884 ఇళ్లలో సర్వే నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం 3,37,253 ఇళ్లలో సర్వే నిర్వహించారు. ఒక్కో బృందంలో ఓఏఎన్ఎం, ఆశా వర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్లతో కూడిన బృందాలు ఇంటింటికీ తిరిగి జ్వరంతో ఉన్న వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఫీవర్ సర్వే: ఇప్పటి వరకు లక్షా 43 వేలకు పైగా పరీక్షలు - telangana news updates
గ్రేటర్ హైదరాబాద్లో ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ఇవాళ 704 బృందాలతో 51,884 ఇళ్లలో సర్వే నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం 1,43,498 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు.
fever survey
జ్వరం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది యాంటీ లార్వా ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. నగరంలో ప్రతీ బస్తీ దవాఖానా, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర దవాఖానాల్లో ఇవాళ 18,586 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు మొత్తం 1,43,498 మందికి జ్వర పరీక్షలు చేశారు.
ఇవీ చదవండి:మూడోదశలో చిన్నారులకు కరోనా ముప్పు