హైదరాబాద్లో రోడ్ల నిర్మాణంలోనూ వేగం పుంజుకుంది. లాక్‌డౌన్‌ను సానుకూలంగా మార్చుకుని అధికారులు యుద్ధప్రాతిపదికన పనులను ముందుకు తీసుకెళ్తున్నారు. వర్షాకాలానికి ముందు లేదా మూడు నెలల్లో అన్ని మార్గాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
హైదరాబాద్ అభివృద్ధి ‘మార్గాలు’ - corona effect on GHMC Works
కొంచెం దూరం విస్తరిస్తే చాలు.. రెండు ప్రాంతాల మధ్య విశాలమైన రోడ్డు అందుబాటులోకి వస్తుంది. అలాంటి 37 రహదారులను జీహెచ్‌ఎంసీ గుర్తించింది. వాటి విస్తరణకు నడుం బిగించింది. అవసరమైన భూసేకరణ సగానికిపైగా పూర్తయింది.
GHMC road works today news
మహానగరపాలక సంస్థ పరిధిలో 9,100కి.మీ రోడ్లున్నాయి. వీటిలో కొంచెం విస్తరిస్తే రెండు ప్రధాన ప్రాంతాల మధ్య విశాల దారి అందుబాటులోకి వస్తుందన్న అంశంపై అధ్యయనం చేసిన అధికారులు.. నాలుగు ప్యాకేజీల్లో పనులకు శ్రీకారం చుట్టారు. నిర్మాణ బాధ్యత హైదరాబాద్ రహదారుల అభివృద్ధి సంస్థ చూస్తోంది. మొత్తం లింకు రోడ్ల పొడవు 44.70కి.మీకు గాను 29కి.మీ పనులు పురోగతిలో ఉన్నాయి. అభివృద్ధికి రూ.313.65కోట్లు ఖర్చు కానుంది.