తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా నియంత్రణకు జీహెచ్​ఎంసీ చర్యలు - జీహెచ్​ఎంసీ చర్యలు

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో జీహెచ్​ఎంసీ ఎంటమాలజీ విభాగం కృషి చేస్తోంది. వ్యాధి ప్రబలకుండ సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని నగరంలో పిచికారి చేస్తున్నారు.

ghmc entomology measures for corona control
కరోనా నియంత్రణకు జీహెచ్​ఎంసీ చర్యలు

By

Published : Apr 2, 2020, 8:25 AM IST

కరోనా కట్టడికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో జాగ్రత్తలు, పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్​ఎంసీ ఎంటమాలజీ విభాగం వ్యాధి ప్రబలకుండా సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని నగరవీధులగుండా పిచికారీ చేస్తున్నారు.

కరోనా నియంత్రణకు జీహెచ్​ఎంసీ చర్యలు

అన్ని క్వారెంటైన్‌ కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, అర్బన్ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో పిచికారి చేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో రెండు మూడు సార్లు ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని రోజూ 500- 680 ప్రాంతాల్లో క్రిమిసంహారక మందును చల్లుతున్నారు. స్ప్రెయింగ్ పనులను జీహెచ్‌ఎంసీ శానిటేషన్ విభాగం అదనపు కమిషనర్ రాహుల్ రాజ్‌, చీఫ్ ఎంటమాలజిస్టు రాంబాబు సమన్వయం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీచూడండి:వైద్య, పోలీసు సిబ్బందికి పూర్తి వేతనం.. అదనంగా నగదు ప్రోత్సాహకాలు

ABOUT THE AUTHOR

...view details