ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో సాగర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. చెత్త గురించి ఆలోచిద్దాం, పరిశుభ్రత పాటిద్దాం అంటూ మున్సిపల్ కార్మికులు నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. తుర్కయాంజాల్ పురపాలక సంఘం కమిషనర్ సురేందర్ రెడ్డి, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు.
పరిశుభ్రత కోసం మున్సిపల్ కార్మికుల ర్యాలీ - GHMC EMPLOYEES Rally in Yamjal
వంద శాతం స్వచ్ఛత సాధించడమే లక్ష్యంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పర్యావరణంపై అవగాహన ర్యాలీ చేపట్టింది. పరిసరాల పరిశుభ్రత వివరిస్తూ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
![పరిశుభ్రత కోసం మున్సిపల్ కార్మికుల ర్యాలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3480373-5-3480373-1559738148224.jpg)
పరిశుభ్రత కోసం మున్సిపల్ కార్మికుల ర్యాలీ
పరిశుభ్రత కోసం మున్సిపల్ కార్మికుల ర్యాలీ