బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు: ఎలక్షన్ కమిషన్ - తెలంగాణ తాజా వార్తలు
15:57 October 05
బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు..
జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. గుర్తింపు పొందిన, నమోదైన 50 రాజకీయపక్షాల్లో 26 పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. అందులో 13 రాజకీయ పార్టీలు బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని తెలపగా.. మూడు పార్టీలు ఈవీఎంల ద్వారా నిర్వహించాలని తమ అభిప్రాయాన్ని వ్యక్త పరిచాయి. మెజారిటీ రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు... 2020లో జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్ బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించామని ఎన్నికల సంఘం తెలిపింది. జీహెచ్ఎంసీతో పాటు మిగిలిన కార్పొరేషన్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఇదీ చూడండి:చట్టబద్ధమైన సంస్థలకు ఛైర్పర్సన్లు లేకపోవడమేంటి?: హైకోర్టు