జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చూపించుకునేందుకు కొందరు నాయకులు అధిష్ఠానాన్ని ఒప్పించి... తమ వారికి టికెట్లు ఇప్పించారు. రంగంలోకి దిగిన వారి వారసులు కొందరిని మెప్పించగలిగి విజయం సాధించారు. మరికొందరు డీలా పడిపోయారు.
వారిని విజయం వరించింది...
* పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి(ఖైరతాబాద్ డివిజన్) తెరాస పక్షాన పోటీ చేసి భాజపా అభ్యర్థి మాధురిపైనా, ఎంపీ కేకే కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి(బంజారాహిల్స్ డివిజన్) భాజపా నేత బద్దం బాల్‌రెడ్డి కుమారుడు మహిపాల్‌రెడ్డిపై విజయం సాధించారు.
*మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతిరెడ్డి(అల్వాల్ డివిజన్) భాజపా అభ్యర్థి వీణాగౌడ్‌పై గెలిచారు.
*తెరాస ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి సోదరుడు రాజేశ్వర్‌రెడ్డి కోడలు వి.సింధూ ఆదర్శ్‌రెడ్డి(భారతీనగర్ డివిజన్) భాజపా అభ్యర్థి గోదావరి అంజిరెడ్డిపై గెలిచారు.
*ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బావ జూపల్లి సత్యనారాయణ(కూకట్‌పల్లి) భాజపా అభ్యర్థి పవన్‌కుమార్‌పై, ఎమ్మెల్యే మరదలు మాధవరం రోజాదేవి (వివేకానంద్‌నగర్ డివిజన్) భాజపా అభ్యర్థి కల్పనపై గెలుపొందారు.
*మాజీ ఎంపీ ఆలె నరేందర్ కోడలు భాగ్యలక్ష్మి గౌలిపుర డివిజన్(భాజపా) నుంచి పోటీచేసి గెలిచారు.