హైదరాబాద్ బోరబండలో తెరాస పార్టీ కార్యాలయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో సంఘాల ప్రతినిధులు డిప్యూటీ మేయర్ బాబ ఫసుద్దీన్ను సన్మానించారు. కేంద్రం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లులను వ్యతిరేస్తూ.. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో తీర్మానించడం గర్వించదగ్గ విషయమని వారు కొనియాడారు. ఈ తీర్మానానికి హర్షం వ్యక్తం చేస్తూ.. తమ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌కు సన్మానం
గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబ ఫసుద్దీన్ని ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో సన్మానించారు. ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లులను వ్యతిరేకిస్తూ గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానించడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఆ తీర్మానానికి..హర్షం వ్యక్తం చేసిన ముస్లిం సంఘాలు
ముస్లింలకు మనోధైర్యం కలిగించేందుకే కౌన్సిల్లో ఈ తీర్మానం చేసినట్లు డిప్యూటీ మేయర్ తెలిపారు. ముస్లింలు ఎవరికీ వ్యతిరేకం కాదని... హిందూ ముస్లింలు ఒక్కటేనన్నారు.
ఇదీ చూడండి: అమ్మ గురించి ఆలోచించండి!