ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ సంచాలకులు విశ్వజిత్ తెలిపారు. 100 నంబర్‌కు డయల్ చేసిన 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం మొత్తం 16 డీఆర్ఎఫ్ ట్రక్కులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సహాయక చర్యలతో పాటు ప్రాథమిక చికిత్స అందించేందుకు సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. డీఆర్ఎఫ్ వాహనాల రాకతో విపత్తు నిర్వహణ విభాగం పటిష్ఠం అయిందంటున్న విశ్వజిత్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఎలాంటి విపత్తునైనా 'డీఆర్ఎఫ్ ట్రక్కులతో' ఎదుర్కొంటాం: విశ్వజిత్ - జీహెచ్ఎంసీ విపత్తుల నిర్వహణ విభాగం
విపత్తుల నిర్వహణ విభాగాన్ని బలోపేతం చేసేందుకు అధునాతన డీఆర్ఎఫ్ టక్కులను అందుబాటులోకి తీసుకొచ్చామని ఆ విభాగం సంచాలకులు విశ్వజిత్ తెలిపారు. సమాచారం అందిన పది నిమిషాల్లోనే ఘటన స్థలానికి చేరుకుంటామని స్పష్టం చేశారు.
ఎలాంటి విపత్తునైనా 'డీఆర్ఎఫ్ ట్రక్కులతో' ఎదుర్కొంటాం: విశ్వజిత్
ఇవీచూడండి: పైవంతెన ప్రమాదాలపై జీహెచ్ఎంసీ అప్రమత్తం