హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ పరిధిలో మెరుగైన పారిశుద్ధ్య సేవల కోసం మరో 1,350 స్వచ్ఛ ఆటోల(GHMC Swachh autos) పంపిణీకి సిద్ధం చేశారు. జంట నగరాలు దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న స్వచ్ఛ ఆటోలు సరిపోవడం లేదు. దీంతో ప్రతి రోజూ 6,500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అవసరం మేరకు స్వచ్ఛ ఆటోల పంపిణీ(GHMC Swachh autos)కి చర్యలు చేపట్టింది బల్దియా.
డ్రైవర్ కం ఓనర్
జీహెచ్ఎంసీ(GHMC Swachh autos) పరిధిలో 2015లో 2,500 స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటికీ వెళ్లి తడి పొడి చెత్త వేర్వేరుగా సేకరించారు. స్వచ్ఛ ఆటో ట్రిప్పర్ల ద్వారా 2016 లో ప్రతి రోజూ 3,500 టన్నులు, 2017లో 4,500 వ్యర్థాలను సేకరించారు. ఈ నేపథ్యం లో 3.3 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల మరో 650 స్వచ్ఛ ఆటోలను డ్రైవర్ కమ్ ఓనర్ పథకం క్రింద రెండో సారి పంపిణీ చేశారు.