పేదవారికి సాయం చేస్తే.. మీరు దీపాలు పెట్టమంటే దీపాలు పెడ్తం.. డాన్సులు చేయమంటే డాన్సులు చేస్తం. హైదరాబాద్ వరదలపై ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాస్తే ఇప్పటివరకు ఉలుకుపలుకులేదు. జన్‌ధన్ ఖాతాలు తెరిస్తే.. ధన్ధన్మని పైసలు వేస్తామని ఇంతవరకు వేయలేదు. అమిత్‌షా గారు మీరు మాకు ఇచ్చిందేం లేదు. సొమ్ము తెలంగాణది... సోకు దిల్లీది. భాజపాపై 132 కోట్ల మంది ప్రజలు ఛార్జ్షీట్లు వేస్తరు. భాజపా ఎల్బీనగర్ నియోజవర్గానికి ఏంచేసిందో చెప్పాలి. వరదసాయం అందజేస్తుంటే ఆపింది మీరు కాదా? పేదవాడి నోటికాడి ముద్దను లాక్కుంది మీరు కాదా? మమ్మల్ని గెలిపించండి రూ. 25 వేలు ఇస్తం అంటున్నరు. రూ. 10వేలు ఆపినోళ్లు... రూ. 25 వేలు ఇస్తరా? వాళ్లకు తెలిసింది ఒక్కటే హిందూ- ముస్లిం. పంచాయితీ పెట్టాలే... నాలుగు ఓట్లు, నాలుగు సీట్లు సంపాదించాలే... అవుతలపడాలే... ఇదే వాళ్లకు తెలిసింది. పేదల పక్షపాతి ప్రభుత్వం తెరాస. ఆరేళ్ల నుంచి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నం. హైదరాబాద్ ప్రజలు నిర్ణయించాలి... ఎట్లాంటి నాయకత్వం కావాల్నో. తెలంగాణలో పక్కాలోకల్ పార్టీ తెరాసనే. గల్లీ పార్టీకి ఓటేస్తారా? దిల్లీ పార్టీకి ఓటేస్తారా? మీరే నిర్ణయించుకోండి. వనస్థలిపురం అభివృద్ధి కావాలంటే గల్లీ బాయ్స్ వల్లే అవుతుంది. దిల్లీ బాయ్స్ వల్ల కాదు.
జీహెచ్ఎంసీ అభివృద్ధి గల్లీ బాయ్స్ వల్లే సాధ్యం: కేటీఆర్
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం రైతుబజార్ వద్ద పురపాలక మంత్రి కేటీఆర్... రోడ్‌షో నిర్వహించారు. తనదైన ప్రసంగంతో కేంద్రంపై విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ అభివృద్ధికి కట్టుబడిన తెరాసకే ఓటేయాలని మంత్రి సూచించారు.
జీహెచ్ఎంసీ అభివృద్ధి గల్లీ బాయ్స్ వల్లే సాధ్యం: కేటీఆర్
----- వనస్థలిపురం రోడ్‌షోలో మంత్రి కేటీఆర్
ఇదీ చూడండి:ఒక్కటే బాకీ ఉంది... అది కూడా నెరవేరుస్తా: కేటీఆర్