తెలంగాణ

telangana

ETV Bharat / state

GHMC: కుక్కల నియంత్రణకు నడుం బిగించిన బల్దియా.. ఏం చేయనుందంటే..?

GHMC takes strict measures to control dogs: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుక్కల బెడదను నియంత్రించడం, కుక్క కాటు సంఘటనలను నిరోధించడంపై మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటయిన హై లెవెల్ కమిటీ సిఫార్సు మేరకు జీహెచ్ఎంసీ పటిష్ఠమైన చర్యలు చేపట్టింది. కమిటీలో ఉత్పన్నమైన సమస్యలను అధిగమించేందుకు కొన్ని తాత్కాలిక, శాశ్వత చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అందుకోసం మానవ వనరులను ఏర్పాటు, కుక్కలను పట్టుకునే వాహనాలు, వీధి కుక్కల స్టెరిలైజేషన్‌ పెంచడంతో పాటుగా అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

Dogs
Dogs

By

Published : Apr 28, 2023, 4:04 PM IST

GHMC takes strict measures to control dogs: జీహెచ్ఎంసీలో కుక్కల బెడద లేకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. ప్రస్తుతం ఉన్న జంతు సంరక్షణ కేంద్రాల్లో మరిన్ని స్టెరిలైజేషన్లు చేపట్టేందుకు మౌలిక సదుపాయాలను పెంచడం, చార్మినార్, శేరిలింగంపల్లి జోన్లలో జంతు సంరక్షణ కేంద్రాల సత్వర ఏర్పాటు, ఏబీసీ సంఖ్యను పెంచడానికి నిర్ణయాలు తీసుకున్నారు. వేసవిలో వీధి కుక్కలకు నీరు అందించడం కోసం పెద్ద ఎత్తున నీటి కొలనులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, హాస్టళ్లు, నాన్ వెజ్ ఆహార వ్యర్థాలను సక్రమంగా పారవేసేందుకు ప్రత్యేక ఏర్పాటు, స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని మున్సిపాలిటీలకు సూచించారు. స్టెరిలైజేషన్‌లను పెంచడానికి ఇప్పటికే ఉన్న 16 ప్రైవేట్ పశు వైద్యులకు అదనంగా 8 మంది ప్రైవేట్ పశు వైద్యులను నియామకానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 30 కుక్కలను పట్టుకునే వాహనాల సంఖ్యను మరో 20 పెంచి అందుకు అనుగుణంగా సిబ్బంది నియామకం చేయనున్నారు.

కుక్కలకు స్టెరిలైజేషన్​: నగరంలోని చుడీబజార్‌లో ప్రస్తుతం ఉన్న జంతు సంరక్షణ కేంద్రం ప్రాంగణంలో మరింత సౌకర్యం కోసం అదనంగా 850 ఫీట్లు గల షెడ్ ఏర్పాటు చేసి.. అందులో 20 బోనులలో 80 కుక్కలను ఒక వారంలో ఉంచే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. చార్మినార్‌ జోన్ కాటేదాన్‌లో మరో పశు సంరక్షణ కేంద్రం నిర్మాణం పనులు మరో పక్షం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. పీపుల్‌ ఫర్‌ యానిమల్స్‌, బ్లూక్రాస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్టెరిలైజేషన్‌ను పెంచేందుకు వారిని ఒప్పించడంతో పాటు పీపుల్‌ ఫర్‌ యానిమల్స్‌ ఆధ్వర్యంలో వీధి కుక్కల స్టెరిలైజేషన్‌ను రోజుకు 15 నుంచి 40కి పెంచారు. మాంసహారం వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడే విసిరే షాపులను గుర్తించి వారికి నోటీసులు ఇచ్చారు.

Sterilization of dogs: హైదరాబాద్‌కు చెందిన బ్లూ క్రాస్‌ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌ సర్కిల్​లో ఇటీవల రోజుకు 20 చొప్పున వీధి కుక్కల స్టెరిలైజేషన్‌ను ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 10కి తగ్గకుండా ఫీడింగ్ స్పాట్‌లను గుర్తించి, యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం స్థానిక కుక్కలకు ఆహారం, వాటి సంక్షేమం కోసం శ్రద్ధ వహించడానికి ప్రతి కాలనీలోని కమ్యూనిటీ జంతు సంరక్షకులను ప్రోత్సహించాలని వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్​లకు ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details