తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నారి మ్యాన్​హోల్​లో పడిన ఘటనలో అధికారిపై వేటు

హైదరాబాద్​ యాదవ్​నగర్​లో చిన్నారి దీక్షిత్​ మ్యాన్​హోల్​లో పడిన ఘటనలో అధికారులు చర్యలు ప్రారంభించారు. మ్యాన్​హోల్​ మరమ్మతు చేయించడంలో నిర్లక్ష్యం వహించిన మెహిదీపట్నం సెక్షన్​ మేనేజర్​ డి.చంద్రును జలమండలి ఎండీ దానకిశోర్​ సస్పెండ్​ చేశారు. చిన్నారికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.25 వేలు సహాయం అందించారు.

By

Published : Aug 23, 2019, 1:46 PM IST

Updated : Aug 23, 2019, 3:23 PM IST

అధికారిపై వేటు

గుడి మల్కాపూర్​ డివిజన్​ మహావీర్​ యాదవ్​నగర్​లో ఈ నెల 21న చిన్నారి దీక్షిత్​ మ్యాన్​హోల్​లో పడిన ఘటనలో మెహిదీపట్నం సెక్షన్​ మేనేజర్​ డి.చంద్రును జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ సస్పెండ్​ చేశారు. అలాగే చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.25 వేలు తక్షణ సాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు.

నిర్లక్ష్యం వల్లే...

మ్యాన్​హోల్​కు మరమ్మతు చేయించకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత అధికారిపై చర్యలు తీసుకున్నారు. గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత ఏజెన్సీనీ బ్లాక్​లిస్టులో పెట్టి... క్రిమినల్​ కేసు నమోదు చేయాలని జలమండలి ఎండీ, జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ ఆదేశించారు.

ఇదీ చూడండి : మ్యాన్​హోల్లో పడిన బాలుడు.. పరిస్థితి విషమం

Last Updated : Aug 23, 2019, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details