ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద గ్రేటర్ హైదరాబాద్‌లో చేపట్టిన సర్వేలో ఇప్పటివరకు 77, 939 మంది వీధి వ్యాపారులను గుర్తించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ తెలిపారు. వారిలో 58, 435 మందికి గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు ఆయన వివరించారు. కరోనా నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న వీధి వ్యాపారుల జీవనోపాధిని పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.
'గ్రేటర్లో 77, 939 మంది వీధి వ్యాపారులను గుర్తించాం' - ghmc commissoner lokesh kumar on street vendors in hyderabad
కింద గ్రేటర్ హైదరాబాద్‌లో చేపట్టిన సర్వేలో ఇప్పటివరకు 77, 939 మంది వీధి వ్యాపారులను గుర్తించామని.. వారిలో 58, 435 మందికి గుర్తింపు కార్డు అందించామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. వీరందరికి ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద రుణాలు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.

'గ్రేటర్లో 77, 939 మంది వీధి వ్యాపారులను గుర్తించాం'
పీఎం స్వనిధి కింద బ్యాంకుల ద్వారా రూ. పది వేల చొప్పున 9, 425 మంది వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయించినట్లు లోకేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ పథకంలో వీధివ్యాపారులకు 7 శాతం వడ్డీతో రూ. పది వేల చొప్పున రుణం మంజూరవుతుందని లబ్ధిదారులు రుణాన్ని 12 నెలల పాటు సమాన వాయిదాల్లో చెల్లించాలని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈ ప్రయోజనాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని వీధి వ్యాపారులకు లోకేశ్‌కుమార్ సూచించారు.
ఇదీ చూడండి:సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా