తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈనెల 31లోపు పెండింగ్​ ఎల్​ఆర్​ఎస్​ డాక్యుమెంట్లు సమర్పించాలి ' - GHMC LRS latest news

జీహెచ్ఎంసీ పరిధిలోని ​ పెండింగ్​ ఎల్​ఆర్​ఎస్​ డాక్యుమెంట్ల సమస్యల పరిష్కారానికి జీహెచ్​ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 31లోపు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు డాక్యుమెంట్లను సమర్పించాలని బల్దియా కమిషనర్ లోకేష్‌కుమార్ వెల్లడించారు.

GHMC Commissioner On LRS
GHMC Commissioner On LRS

By

Published : Dec 4, 2019, 6:24 PM IST

హైదరాబాద్ మహానగరం పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్​కు సంబంధించిన డాక్యుమెంట్లను ఈ నెల 31లోపు సమర్పించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ వెల్లడించారు. ప్రతి సర్కిల్‌లో ప్రతి రోజు సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ఏసీపీలు అందుబాటులో ఉండి దరఖాస్తుదారులకు తగు సూచనలిస్తారని కమిషనర్ పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన డ్రైవ్‌లో 26వేల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను ఆమోదించినట్లు కమిషనర్ స్పష్టం చేశారు.

నగరంలోని 709 కిలోమీటర్ల ప్రధాన రహదారుల నిర్వహణను మెరుగుపర్చేందుకు టెండర్ ప్రక్రియకు తుదిరూపు ఇచ్చినట్లు కమిషనర్​ తెలిపారు. ఈ నెల 10 నుంచి సంబంధిత ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలను అప్పగించనున్నట్లు లోకేశ్​ కుమార్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రతి జోన్‌లో 10కిలోమీటర్ల రోడ్లను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామన్నారు.

వచ్చే రెండు మూడు నెలల్లో పాడైన రహదారుల మరమ్మత్తు పనులు పూర్తవుతాయని జీహెచ్ఎంసీ కమిషనర్​ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సీసీ రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు చెప్పారు.

ఫిబ్రవరి నాటికి 9వేల రెండు పడుక గదుల ఇళ్లు సిద్ధం...

జీహెచ్‌ఎంసీ పరిధిలో 9వేల రెండు పడక గదుల ఇళ్లు నిర్మాణం పూర్తయ్యాయని చెప్పారు. వీటిని ఫిబ్రవరిలో అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. జూన్‌ వరకు 50వేల ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కమిషనర్ వివరించారు.

'ఈనెల 31లోపు పెండింగ్​ ఎల్​ఆర్​ఎస్​ డాక్యుమెంట్లు సమర్పించాలి '


ఇవీ చూడండి: 'డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు హైదరాబాదే హబ్'

ABOUT THE AUTHOR

...view details