GHMC Commissioner on City Election Review :ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ రొనాల్డ్ రోస్ అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, షెడ్యూల్‌ను అనుసరించి నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్(Election Notification) వెల్లడించనున్నట్లు తెలిపారు. నవంబర్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించడం జరుగుతుందని.. 30వ తేదీన పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
List of Polling Stations in Hyderabad :జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 1,688 లొకేషన్లలో 3,986 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3,931 ఉండగా.. రాచకొండ కమిషనరేట్‌లో 4, సైబరాబాద్ కమిషనరేట్‌లో 51 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. ఎన్నికల నిర్వహణకు 34,452 పోలింగ్ స్టాఫ్, పోలీస్ సిబ్బందిని(Police Personnel) ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
GHMC Commissioner on Telangana Election 2023 : అసెంబ్లీ పోరుకు 'గ్రేటర్' రెడీ.. వారిపై స్పెషల్ ఫోకస్
EVM/VVPT Awareness Program : ఎన్నికల్లో వినియోగించే ఈవీఎమ్‌ల ఫస్ట్ లెవల్ చెకప్ పూర్తి చేసి విక్టరీ ప్లే గ్రౌండ్లో భద్రపరచడం జరిగిందని తెలిపారు. ఈవీఎంపై అవగాహన కోసం వివిధ బస్ స్టేషన్లలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని.. 16 ప్రదేశాలలో ఈవీఎమ్, వీవీ ప్యాట్లపై 15,158 మందికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. 15 మొబైల్ వ్యాన్ల ద్వారా ఈవీఎం, వీవీ ప్యాట్లపై గ్రేటర్ హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు.
ఓటర్ల సందేహాలు నివృత్తి చేయడానికి జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భారత ఎన్నికల సంఘం 1950 టోల్ ఫ్రీ నెంబర్, 1800-599-2999 నంబర్లు 24 గంటల పాటు పనిచేస్తాయన్నారు. సీ-విజిల్ యాప్ ద్వారా మోడల్ కోడ్‌లో ఉల్లంఘన జరిగిన ఫిర్యాదులను 100 నిమిషాలలోపు పరిష్కరించి యాప్‌లో ఉంచుతామని తెలిపారు.