జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ కోసం మంగళవారం నిర్వహించిన శిక్షణకు గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు. పీఓ, ఏపీఓలకు ఎన్నికల విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీచేశామన్నారు. హాజరుకాలేకపోయినవారికి ఇవాళ మరోసారి శిక్షణ ఇస్తున్నామన్నారు. ఎన్నికల శిక్షణకు హాజరుకానివారు, తమకు కేటాయించిన శిక్షణ కేంద్రంలో 25వ తేదీన తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.
ఎన్నికల విధులకు గైర్హాజరైనవారిపై చర్యలు: లోకేశ్‌కుమార్ - జీహెచ్ఎంసీ ఎన్నికల వార్తలు
ఎన్నికల విధులకు గైర్హాజరైనవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం నిర్వహించిన శిక్షణకు హాజరుకానివారికి నేడు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల విధులకు గైర్హాజరైనవారిపై చర్యలు: లోకేశ్‌కుమార్
ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి వస్తున్నారని, ఎట్టిపరిస్థితులోనూ మినహాయింపు కుదరదని లోకేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల విధులకు గైర్హాజరైనవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీచూడండి:ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అందరూ కృషి చేయాలి: ఎస్ఈసీ