తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ 'ఆరు’ పాటించండి.. ఆనందంగా జీవించండి! - six rules to prevent corona

రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల్ని కట్టడి చేసేందుకు నగరవాసుల భాగస్వామ్యం అవసరమని బల్దియా కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ కోరారు. స్వీయ జాగ్రత్తలు పాటిస్తేనే ముప్పు నుంచి బయటపడగలమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు చేపడతామన్నారు.

six rules to be safe from corona virus
కరోనా కట్టడికి ఆరు సూత్రాలు

By

Published : Jun 8, 2020, 1:12 PM IST

కరోనాను కట్టడి చేయడానికి స్వీయ నియంత్రణ పాటించడమొకటే మార్గమని జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేశ్​ కుమార్ తెలిపారు. రోజురోజుకు విజృంభిస్తోన్న కరోనా కేసుల్ని కట్టడి చేసేందుకు నగరవాసుల భాగస్వామ్యం అవసరమని కోరారు. ఆరు నియమాలు విధిగా పాటించాలని సూచించారు.


1.వయసు: పదేళ్ల కంటే తక్కువ వయసున్నవారు, 60 ఏళ్లు పైబడిన వారు ఇళ్లకే పరిమితమవ్వాలి.


2. మాస్కులు మరవొద్దు: బయట అడుగుపెడితే మాస్కు మరవొద్దు. ప్రతి ఒక్కరితో ఆరు అడుగుల దూరం పాటించడం వ్యక్తిగత విధి.


3. పనిప్రాంతం: పని ప్రదేశాల్లో శానిటైజర్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు ద్రావకాలు ఏర్పాటు చేయాలి. భౌతిక దూరం తప్పనిసరి చేయాలి.

4. ప్రయాణమొద్దు: అనవసరంగా ఎక్కడికీ ప్రయాణం చేయొద్దు. తప్పనిసరైతే మాస్కులు, ఎడం తప్పక పాటించాలి.


5. సంప్రదించండి:జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తితే వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రిని సందర్శించాలి. హెల్ప్‌లైన్‌ నంబరుకి సమాచారం ఇవ్వాలి.


6. వీరు జాగ్రత్త: మధుమేహులు, శ్వాస, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రయాణాలు చేయొద్దు. ఇంటికే పరిమితమవ్వాలి.

ABOUT THE AUTHOR

...view details