ఆరో విడత హరితహారంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 లక్షల మొక్కలు నాటుతామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. సూరారం, మాదన్నగూడ, నాదర్గుల్లో అర్బర్ ఫారెస్ట్ పార్కులు అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
'ఆరో విడత హరితహారంలో 50 లక్షల మొక్కలు నాటుతాం' - తెలంగాణ తాజా వార్తలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆరో విడత హరితహారంలో భాగంగా 50 లక్షలు మొక్కలు నాటనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. నగరంలోని అన్ని నర్సరీలలో మొక్కలు సిద్ధంగా ఉన్నాయని... వర్షాలు మొదలవ్వగానే నాటుతామన్నారు.
'ఆరో విడత హరితహారంలో 50 లక్షల మొక్కలు నాటుతాం'
నగరంలోని కాలనీలు, అపార్ట్మెంట్ వాసులు ఈ ఏడాది పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నగరంలో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతుందని.... మొక్కలు ఎక్కువ సంఖ్యలో పెంచి హరిత హైదరాబాద్‌గా మార్చాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు.
ఇదీ చూడండి:ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: మంత్రి ఈటల