హైదరాబాద్లో రాగల మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. కొన్నిచోట్ల అతిభారీగా 9 నుంచి 16 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు. వరద ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేసి, అందుబాటులో ఉంచాలని జోనల్ కమిషనర్లు, డిప్యూటి కమిషనర్లను ఆదేశించారు.
రాగల మూడ్రోజులు హైదరాబాద్లో భారీ వర్షాలు: లోకేశ్ కుమార్ - floods in Hyderabad
వాతావరణ శాఖ జారీ చేసిన అంచనాల ప్రకారం రాబోయే మూడ్రోజులు హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. వానల వల్ల ఏర్పడే వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్
అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో రిలీఫ్ సెంటర్లుగా గుర్తించిన పాఠశాలలో, కమ్యూనిటీహాల్స్, ఇతర వసతులను సిద్దంగా ఉంచాలని సూచించారు. అధికారులందరూ అందుబాటులో ఉండాలని కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశించారు.