హైదరాబాద్‌లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. కాలనీల్లో నిలిచిన నీటిని పంపుల ద్వారా తొలగిస్తున్నట్లు వివరించారు. రహదారులు, నాలాల్లోకి కొట్టుకు వచ్చిన వ్యర్థాల తొలగింపు కోసం ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోందని స్పష్టం చేశారు. పలు కాలనీల్లో వరద సహాయక చర్యలను జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించారు.
సహాయక చర్యలు ముమ్మరం చేశాం: జీహెచ్ఎంసీ కమిషనర్ - వరద ప్రభావిత ప్రాంతాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సమీక్ష
హైదరాబాద్‌లో వరద బాధితుల కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కాలనీల్లోని నీటిని పంపుల ద్వారా తొలగిస్తున్నామని వివరించారు. పలు కాలనీల్లో సహాయక చర్యలను పరిశీలించారు.
సహాయక చర్యలు ముమ్మరం చేశాం: జీహెచ్ఎంసీ కమిషనర్
వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధుల నివారణకు బ్లీచింగ్ పౌడర్, యాంటీ లార్వా, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాలు చల్లుతున్నామని తెలిపారు. 30 డీఆర్ఎఫ్, 30 అగ్నిమాపక ట్యాంకర్లను... ప్రతి సర్కిల్‌కు రెండు చొప్పున వినియోగిస్తున్నామని లోకేశ్‌కుమార్ వివరించారు.
ఇదీ చదవండి:ఊరిలో పుట్టి.. ఉన్నత శిఖరాలకు ఎదిగిన ఏలియా