గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా జరుగుతుందని ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల అంశంపై గందరగోళం కలిగించే విధంగా వస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. 2016 ఎన్నికల్లో అమలు చేసిన డివిజన్లు, రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు ఉండవని అవే యథావిధిగా కొనసాగుతాయని లోకేష్‌కుమార్ వెల్లడించారు.
'జీహెచ్ఎంసీ ఎన్నికలపై వస్తున్న ప్రచారాలను నమ్మవద్దు' - hyderabad district update news
జీహెచ్ఎంసీ ఎన్నికల అంశంపై వస్తున్న గందరగోళ ప్రచారాలను నమ్మవద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
'జీహెచ్ఎంసీ ఎన్నికలపై వస్తున్న ప్రచారాలను నమ్మవద్దు'
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మార్గదర్శకాలకు లోబడి ఈ ఏడాది జరిగిన స్పెషన్ సమ్మరీ రివిజన్ ఆధారంగా ఎన్నికల ఓటరు జాబితా రూపొందుతుందని.. ఆ మేరకే ఈసారి కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని వివరించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేంత వరకు ఓటరుగా నమోదు చేసుకున్న వారందరూ జీహెచ్ఎంసీ ఓటరు జాబితాలో ఉంటారని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ అంశంపై అనధికార వార్తలను విశ్వసించవద్దని లోకేష్‌కుమార్ మరోసారి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండిః'జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలి'