తెలంగాణ

telangana

ETV Bharat / state

కంటోన్మెంట్​ జోన్లలో అధికారుల చర్యలపై జీహెచ్​ఎంసీ ఆరా - మలక్​పేట కంటోన్మెంట్​ జోన్ల తాజా వార్తలు

హైదరాబాద్​ ఓల్డ్​ మలక్​పేట పరిధిలోని కంటోన్మెంట్​ జోన్​లో అధికారులు తీసుకుంటున్న చర్యలపై జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​ కుమార్​ ఆరా తీశారు. వాహెద్​ నగర్​లో ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి కరోనా రావడం వల్ల క్షేత్రస్థాయి చర్యలు చేపట్టారు. అలాగే సోమవారం కుర్మగూడలో కూడా 8 మందికి కొవిడ్​ నిర్ధరణ అయినందున అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

కంటోన్మెంట్​ జోన్లలో అధికారుల చర్యలపై జీహెచ్​ఎంసీ ఆరా
కంటోన్మెంట్​ జోన్లలో అధికారుల చర్యలపై జీహెచ్​ఎంసీ ఆరా

By

Published : May 19, 2020, 3:53 PM IST

హైదరాబాద్‌ ఓల్డ్ మలక్‌పేట వాహెద్ నగర్ కంటోన్మెంట్ జోన్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్​ కుమార్ పర్యటించారు. కరోనా వైరస్‌ మహమ్మారిని కట్టడి చేసేందుకు అధికారులు తీసుకుంటున్న క్షేత్రస్థాయి చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి కరోనా పాజిటివ్ వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ ప్రాంతాన్ని కంటోన్మెంట్‌ జోన్​గా ప్రకటించి.. ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు సూచించారు. అదే విధంగా సోమవారం మాదన్నపేట పోలీసు స్టేషన్ పరిధిలోని కుర్మగూడలో కూడా 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ ప్రాంతంలో కూడా అధికారులు కొవిడ్​ నియంత్రణ చర్యలను ముమ్మరం చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.

ఇవీ చూడండి:'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details