నాగోల్ పశుసంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన దానకిషోర్
నాగోల్ సమీపంలోని పశుసంవర్ధక సంరక్షణ కేంద్ర నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ పరిశీలించారు. నెల రోజుల్లోగా ఫతుల్లగూడలోని పశుసంరక్షణ సెంటర్ను ప్రారంభిస్తామని కమిషనర్ తెలిపారు.
హైదరాబాద్ నాగోల్ సమీపంలోని ఫతుల్లగూడలో నిర్మిస్తున్న పశుసంవర్ధక కేంద్రం పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ పరిశీలించారు. ఈ కేంద్రంలో 400 వీధి కుక్కలు, 50 గేదెలు, 300కు పైగా కోతుల సంరక్షణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ మరో ఆరు నెలల్లోగా భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. వారం రోజుల్లో జీడిమెట్లలో భవన నిర్మాణ వ్యర్థాల సైక్లింగ్ ప్లాంట్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. శంషాబాద్, శేరిలింగంపల్లిలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లకు భూమి కేటాయించేందుకు రంగారెడ్డి జిల్లా అంగీకారం తెలిపిందని వివరించారు.
ఇదీ చూడండి: అక్రమ నిర్మాణదారులపైనే కూల్చివేత వ్యయం