తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షాకాల విపత్తుపై అధికారులతో దానకిశోర్​ సమీక్ష - dana kishore

భాగ్యనగరంలో వ‌ర్షకాలంలో వ‌రదముంపునకు గుర‌య్యే 120 ప్రాంతాల‌ను ప‌ర్యవేక్షించ‌డానికి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాల‌యంలోని సీనియ‌ర్ అధికారుల‌ను సూప‌ర్‌వైజ‌రీ అధికారులుగా నియ‌మిస్తున్నట్లు క‌మిష‌న‌ర్ దాన‌ కిశోర్ తెలిపారు.

దానకిశోర్​ సమీక్ష

By

Published : Jun 26, 2019, 5:07 AM IST

Updated : Jun 26, 2019, 9:25 AM IST

హైదరాబాద్​లో వ‌ర్షాకాల విప‌త్తుల నివార‌ణ, ఇత‌ర అంశాల‌పై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల‌తో కమిషనర్​ దానకిశోర్ స‌మీక్ష నిర్వహించారు. విప‌త్తుల నివార‌ణ‌కై ప్రత్యేకంగా 23 కోట్ల వ్యయంతో మాన్సూన్ రిలీఫ్ బృందాలు, ఇన్‌స్టాంట్ రిపేర్ టీమ్స్ ఇత‌ర అత్యవస‌ర బృందాల‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 31 ముంపు ప్రాంతాల వ‌ద్ద 10 హార్స్ ప‌వ‌ర్ సామ‌ర్థ్యం గ‌ల రెండు ప‌వ‌ర్ మోట‌ర్ల‌ను ఏర్పాటుచేసి వ‌ర్షం స‌మ‌యంలో నీటిని ఎత్తిపోస్తామని చెప్పారు. ప్రతి ముంపు ప్రాంతానికి ఒక అధికారిని స‌ర్కిల్ స్థాయిలో నియ‌మించామ‌ని, వీరంద‌రిపై ప‌ర్యవేక్షణ‌కు క‌మిష‌న‌ర్ కార్యాల‌యానికి చెందిన సీనియ‌ర్ అధికారులు, చీఫ్ ఇంజినీర్ల‌ను సూప‌ర్‌వైజ‌రీ అధికారులుగా నియ‌మించామ‌ని తెలిపారు. హైద‌రాబాద్‌లో 48 రోజులే వ‌ర్షాలు కురుస్తాయ‌ని... వీటిలో 20 నుంచి 25 రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని అన్నారు. న‌గ‌ర‌వాసుల‌కు ఇబ్బందులు త‌లెత్తకుండా స‌మ‌ర్థవంతంగా ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని సూచించారు.

Last Updated : Jun 26, 2019, 9:25 AM IST

ABOUT THE AUTHOR

...view details