తెలంగాణ

telangana

ఐదు రోజుల్లో 49 శిథిల భవనాలు కూల్చేశాం: జీహెచ్‌ఎంసీ కమిషనర్

By

Published : Oct 17, 2020, 7:26 AM IST

Updated : Oct 17, 2020, 7:53 AM IST

హైదరాబాద్‌లో శిథిలావస్థ భవనాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి, మరమ్మతులు చేయిస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ఐదు రోజుల్లో 49 భవనాలు కూల్చేశామని అన్నారు. ప్రత్యామ్నాయం లేనివారికి కమ్యూనిటీ హాల్స్‌లో తాత్కాలిక వసతి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు జీహెచ్‌ఎంసీ అధికారులకు సహకరించాలని కోరారు.

ghmc commissioner comment on old buildings demolished in hyderabad
ఐదు రోజుల్లో 49 శిథిల భవనాలు కూల్చేశాం: జీహెచ్‌ఎంసీ కమిషనర్

హైదరాబాద్‌ నగరంలో శిథిలావ‌స్థకు చేరిన 49 భ‌వ‌నాలు ఐదు రోజుల్లో కూల్చివేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌ కుమార్ తెలిపారు. అలాంటి భవనాల్లో ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయం లేనివారికి క‌మ్యునిటీ హాల్స్‌లో తాత్కాలిక వ‌స‌తి క‌ల్పిస్తామన్నారు. ఇప్పటివరకూ న‌గ‌రంలో 531 భ‌వ‌నాలు శిథిలావ‌స్థలో ఉన్నట్లు గుర్తించామని... వాటిలో 176 భ‌వ‌నాల‌ు కూల్చి వేసి, 109 భ‌వ‌నాల‌కు మ‌ర‌మ్మతులు చేయించామని పేర్కొన్నారు.

మూసి న‌ది పరీవాహక ప్రాంతం మంగ‌ళ‌హాట్‌లో నివ‌సిస్తున్న 35 మందిని ఖాళీ చేయించి పున‌రావాస కేంద్రాల‌కు తరలించామని ఆయన తెలిపారు. ప్రమాద‌క‌రంగా ఉన్న శిథిల భ‌వ‌నాల్లో నివ‌సించ‌రాద‌ని నోటీసులు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. వరదతో దెబ్బతిన్న ఇళ్ళలోనూ ఉండొద్దని ప్రజలకు సూచించారు. ఇళ్ళు ఖాళీ చేయడంలో ‌జీహెచ్ఎంసీ అధికారుల‌కు స‌హ‌క‌రించాలని కోరారు.

ఇదీ చదవండి:ముంపు బాధితులు ప్రభుత్వానికి అండగా ఉండాలి: కేటీఆర్​

Last Updated : Oct 17, 2020, 7:53 AM IST

ABOUT THE AUTHOR

...view details